లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ..!

రేటింగ్: 3.0/5

చిత్రం : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

నటీనటులు: విజయ్ కుమార్ – యజ్ఞ శెట్టి – శ్రీతేజ్ తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఛాయాగ్రహణం: రామీ
రచన-రామ్ గోపాల్ వర్మ – నరేంద్ర చారి
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి – దీప్తి బాలగిరి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ-అగస్త్య మంజు

వాస్తవం సినిమా: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాజకీయ జీవితాన్ని ఆధారంగా మెయిన్ లైన్ తీసుకుని రామారావు గారి జీవితంలో ఆయన భార్య లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఎటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి…రాజకీయంగా, కుటుంబపరంగా మరియు వ్యక్తిగతంగా బయట ప్రపంచానికి తెలియనివి అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తాజాగా విడుదలైంది. ఒక ఆంధ్ర రాష్ట్రం మినహా ఎన్నో ఆటంకాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

స్టోరీ :

నందమూరి తారకరామారావు గారి జీవితంలో లక్ష్మీపార్వతి ఒక అభిమానిగా ఆయన బయోగ్రఫీ ను రాస్తాను అంటూ ఎన్టీఆర్ జీవితంలో మరియు ఆయన ఇంటిలో ప్రవేశించి ఏ విధంగా ఎన్టీఆర్ కి బాగా దగ్గర అవుతుందో అదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. ఎన్టీఆర్ ని లక్ష్మీ పార్వతి ని దగ్గరికి చేర్చుకోవడంతో …ఆయన సొంత కుటుంబ సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించడం వంటి విషయాలను అద్భుతంగా బయట ప్రపంచానికి తెలియని చాలా విషయాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ చూపించాడు. ఇదే క్రమంలో చంద్రబాబు పార్టీలో తన ఆధిపత్యం కోసం లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని పొలిటికల్ గా ఆడిన కన్నింగ్ గేమ్ …ఈ గేమ్ లో ప్రముఖులు అనగా ఓ పత్రికాధిపతి మరియు కొంతమంది సీనియర్ ప్రముఖ నాయకులు లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి ఎన్టీఆర్ ని ప్రజల దృష్టిలో ఒక బలహీనమైన వ్యక్తిగా ఏ విధం గా చిత్రీకరించడం  …అదే సమయంలో సొంత పార్టీ నేతలనే తన వైపు చంద్రబాబు ఏ విధంగా తిప్పుకున్నాడో ఆ సన్నివేశాలను చాలా రక్తి కట్టించారు. మరోపక్క లక్ష్మీపార్వతి ..ఎన్టీ రామారావు గారిని పార్టీలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే లా …రామారావు గారిని మోటివేట్ చేయడాన్ని బాగా చూపించారు. చివరాకరికి అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న చంద్రబాబు రామారావు గారిని ఏవిధంగా వెన్నుపోటు పొడిచారు అన్న దాన్ని అద్భుతంగా చూపించాడు వర్మ. ఒక రకంగా చెప్పాలంటే సినిమా సెకండాఫ్ నుండి రామారావుగారి చనిపోయేదాకా చాలా అద్భుతంగా రాజకీయంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వెన్నుపోటు అంటే ఏంటో వెండితెరపై చూపించాడు రాంగోపాల్ వర్మ.

సినిమా హైలెట్స్ : 

ముఖ్యంగా ఫస్టాఫ్ లో కేవలం లక్ష్మీపార్వతి మరియు ఎన్టీఆర్ ల మధ్య చిగురించిన బంధాన్ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అయితే మొదటి భాగంలో లక్ష్మీపార్వతి …ఎన్టీఆర్ ని మంచిగా చేసుకోవడానికి అతిగా ప్రవర్తించినట్లు..మొదటి భాగం మొత్తం ఎన్టీఆర్ మరియు లక్ష్మీపార్వతి కనబడుతున్నట్లు దీంతో కొంత ప్రేక్షకుడికి బోర్ కొట్టిన సందర్భాలు కూడా మొదటి భాగంలో ఉన్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు సన్నివేశాలు కూడా అడపాదడపా మొదటి భాగంలో ఉన్నా, పెద్దగా రక్తికట్టించ లేదు. అయితే ఎప్పుడైతే మేజర్ చంద్రకాంత్ సినిమా సక్సెస్ మీట్ సమయంలో …లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఎన్టీఆర్ ఎప్పుడైతే ప్రకటించాడో..ఇదే సమయంలో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని తెలియజేస్తాడో రాజకీయంగా మరియు కుటుంబపరంగా సినిమాని ప్రేక్షకుడి మైండ్ సెట్ లో ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉత్కంఠంగా సినిమాను చివరిదాకా అలా తీసుకెళ్లారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా పార్టీలో తన ఆధిపత్యం కోసం చంద్రబాబు చేసే కన్నింగ్‌ను మాత్రం ఓ రేంజ్‌లో చూపించారు రామ్ గోపాల్ వర్మ. చంద్రబాబు, రామారావు గారికి పొడిచిన వెన్నుపోటు మరియు అసెంబ్లీ సన్నివేశాలలో రామారావు గారిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకించే సన్నివేశాలను చాలా అద్భుతంగా చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఇదే క్రమంలో రామారావు గారి చివరి క్షణంలో బాబు గారు పొడిచిన వెన్నుపోటు కి ఎన్టీఆర్ ఎదుర్కొన్న మానసిక క్షోభను కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను..హాల్లో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. ఇంత మానసిక వేదనను అనుభవించిన ఎన్టీఆర్ చివరాకరికి దారుణంగా మానసిక క్షోభ అనుభవించి…చనిపోతారు. ఆ సమయంలో ఆయన పార్థివ దేహాన్ని మోస్తున్న నిజజీవితంలో జరిగిన సన్నివేశాలు వెండితెరపై చూపించడంతో చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కంటనీరు పెట్టుకున్నారు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ కలిసి ఉండే సన్నివేశాల్లో కళ్యాణి మాలిక్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ సినిమాలో వినలేదు.

రిజల్ట్ :

ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా అద్భుతంగా చూపించాడు వర్మ. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదే విషయాన్ని చాలామంది ప్రేక్షకులు అభిమానులు కూడా అంటున్నారు. ఇక ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ చక్కగా కుదిరారని కూడా ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా అద్భుతం అని చెప్పవచ్చు.