భీమవరంలో పవన్ గెలుపు నల్లేరుపై నడకే..!!!

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం విధితమే. ఆ రెండు స్థానాలలో ఒకటి భీమవరం కాగా మరొకటి గాజువాక. అయితే ఈ రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ గాజువాక స్థానం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. మరి భీమవరం లో జనసేన ప్రభావం ఎంత వరకు ఉంటుంది..?? పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమేనా..?? గెలిస్తే మెజారిటీ ఏ మేరకు వస్తుంది..?? అనే విషయంపై మాత్రం విశ్లేషకులు ఓ అంచనాకి రాలేకపోతున్నారు. ఎందుకంటే

భీమవరంలో జనసేనని విజయం సాధించాలంటే తప్పనిసరిగా క్షత్రియుల మద్దతు అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే భీమవరంలో కాపు ల ఓట్లు అత్యధికం అయినా గెలుపును డిసైడ్ చేసేది మాత్రం క్షత్రియులు అని చెప్పడంలో సందేహం లేదు. మరి క్షత్రియులు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తారా అంటే. భీమవరంలో అధికశాతం కాపుల ఓట్లు ఉన్నాయి వాటిలో 90 ఓట్లు జనసేనానికి వేస్తారు అందులో సందేహం లేదు. ఈ క్రమంలో క్షత్రియుల ఓట్లు ఎటువైపు అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే భీమవరం లో ఉన్న కొంత మంది క్షత్రియుల మద్దతు జనసేనాని కి పుష్కలంగా ఉంది. అయితే మిగిలిన క్షత్రియుల మద్దతు కూడా పవన్ కళ్యాణ్ సంపాదించాలంటే భీమవరం నుంచి ఇండస్ట్రీ కి వెళ్ళిన హీరోల మద్దతు తప్పనిసరి అవుతోంది. అయితే ఈ విషయంలో జనసేనాని భీమవరం నుంచి వెళ్లిన టాలీవుడ్ హీరోలు బాసటగా నిలవడం ఉన్నారని తెలుస్తోంది. స్టార్ కమెడియన్ సునీల్ తప్పకుండా జనసేనాని కి మద్దతు ఇస్తానని ప్రచారం కూడా చేస్తానని తెలిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో

పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వనున్నాడని ని టాక్ వినిపిస్తోంది. ఇంకా సినిమా నటులు కూడా తమ సొంత ఊరు భీమవరం వచ్చి పవన్ కళ్యాణ్ కి ప్రచారం చేయనున్నారట. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తయితే పవన్ కళ్యాణ్ కి భీమవరం లో ఉన్న అశేష అభిమానులు సైతం పట్టం కట్టడానికి సిద్ధంగా ఉండటంతో భీమవరంలో సైతం పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు.