భారత దిగ్గజ బాక్సర్‌, ప్రపంచ చాంపియన్‌ మేరీ కోమ్‌ సంచలన నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్టు భారత దిగ్గజ బాక్సర్‌, ప్రపంచ చాంపియన్‌ మేరీ కోమ్‌ వెల్లడించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంకోసమే ఆమె నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. తన విభాగంలో ఒలింపిక్స్‌ కోటా సాధించడం కష్టమని, అందుకే ప్రణాళికా బద్దంగా టోర్నీలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలిపింది. గత ఏడాది ఢిల్లిద్లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ నెగ్గిన మేరీ కోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌కోసం రష్యాలోని ఏకతెరింగ్‌బర్గ్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని నిశ్చయించింది. ఇందుకోసం వచ్చే నెలలో థాయిలాండ్‌లో జరుగనున్న ఆసియా ఛాంపియన్‌ షిప్‌నుంచి వైదొలగింది. ‘ఈ ఏడాది నాకు ఎంతో కీలకం. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే నా తొలి ప్రాధాన్యం. ప్రతి టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. 51 కిలోల విభాగంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. వీలైనన్ని టోర్నీలలో గెలుపొంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలి’ అని తెలిపింది.