కమెడియన్ గా మళ్లీ బిజీ అవుతున్న సునీల్..!

వాస్తవం సినిమా: గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో కమెడియన్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో హీరోగా నటించాలని ముందడుగు వేశాడు సునీల్. దీంతో మొదటి లో రెండు మూడు సినిమాలు బానే అలరించినా గాని తరువాత వరుసగా ఫ్లాపులు మరియు పరాజయాలు పలకరించడంతో చాలాకాలం వరకు సినిమాలకు దూరంగా ఉన్నాడు సునీల్. ఈ క్రమంలో తన ప్రాణస్నేహితుడు త్రివిక్రం దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం సునీల్ ఐదు సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ చాలా బిజీ అయిపోయాడు ఇండస్ట్రీలో. సునీల్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో సాయి ధరమ్ ,చిత్రలహరి అలాగే డిస్కో రాజా , అల్లు అర్జున్ 19 వీటితో పాటు మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు వున్నాయి. ఇక ఈ ఏడాది మొదటగా చిత్రలహరి తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు సునీల్. ఇందులో ఆయన కామెడీ మళ్ళీ పాత సునీల్ ను గుర్తుకుతెచ్చేలా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.