దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది!

వాస్తవం ప్రతినిధి:

అది గోవా పనాజీ ప్రాంతం….

ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు…ఇంతలో వెనక నుంచి 25 సంవత్సరాల యువకుడు కారుతో పదే పదే హారన్ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని .స్కూటర్ పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు.వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి నేనెవరినో తెలుసా? నేను ఈ ప్రాంత డి ఎస్ పి కొడుకుని నాకే దారి ఇవ్వవా? అని ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు. వెంటనే ఆ వ్యక్తి సున్నితంగా నవ్వుతూ బాబూ…నువ్వు డి ఎస్ పి కొడుకు వైతే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని బదులిచ్చాడు…ఆ వ్యక్తి ఎవరో కాదు…..అప్పటి గోవా ముఖ్యమంత్రి ,నిన్నటి వరకు దేశ రక్షణ మంత్రి.

మనోహర్ పారికర్ గారు రక్షణ శాఖ మంత్రి కాక ముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్తితులలో వాడే ప్రత్యేక మైన షూస్ ను ఒక్కొక్క జత షూ 25,000 రూపాయల చొప్పున ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు …మనోహర్ పారికర్ గారు రక్షణశాఖ భాద్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తున్న పారికర్ గారు షూస్ ను 25,000 రూపాయలకు కొనుగొలు చేయడం చూసి, వాటిని దిగుమతి చేసుకొవడానికి బదులు భారత్ లో తయారుచేయించాలని భావించారు.

అయన ఈ షూ గురించి వాకబు చేయడంతో బిత్తరపొయే అంశాలు వెలుగులో కి వచ్చాయి …అ షూ ను తయారు చేస్తుంది భారత్ లోని రాజస్థాన్ లోనే…అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రయిల్ వెళ్ళి మరలా అక్కడి నుండి మనం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నామని తెలియడంతో ఆశ్చర్యపొయిన పారికర్ గారు, వెంటనే ఆ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకు రమ్మని రక్షణశాఖ అధికారులను ఆదేశించారు….

అయితే సమయానికి డబ్బులు చెల్లించరని, బిల్లులు త్వరగా పాస్ కావని భారత రక్షణశాఖతో ఒప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించకపొవడంతో, మనోహర్ పారికర్ గారు స్వయంగా తనే యాజమాన్యాన్ని కలుసుకుని డబ్బు చెల్లింపులలో ఒక్క రోజు ఆలస్యమైనా తనకు ఫోను చేయమని తన వ్యక్తిగత ఫొన్ నంబర్ యిచ్చి ఒక్కొక్క జత షూస్ 2200 లకు అందించేలా వొప్పందం కుదుర్చుకున్నారు ….మనం ఇజ్రాయిల్ నుండి 25,000 కు దిగుమతి చేసుకుంటున్న షూస్ ను కేవలం 2200 కే అందించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది..

మనోహర్ పారికర్ గారి పనితనం ఏలా ఉంటుందో చెప్పడనికి ఇదొక ఉదాహరణ .

దేశంలోనే భూతద్దం పెట్టినా దొరకరు.. ఇలా సాధారణమైన వ్యక్తిలా జీవితాన్ని గడుపుతున్న ముఖ్యమంత్రి..చిన్న చిన్న సర్పంచ్, ఎం పి టి సి పదవులు ఉన్నా పెద్ద పెద్ద బిల్డప్( షోపుటప్ లు) లు ఇచ్చే ఈ కాలంలో ….ఒక వ్యక్తి కొరకు రాష్ట్రం, కేంద్రం డిమాండ్ చేయటం చూస్తుంటే ఆయన నిజాయితీ ఏ పాటిదో అర్థమౌతుంది.ఆయనే మనోహర్_పారికర్ అదే నిజాయితికి గల వ్యక్తికి ఉన్న గుర్తింపు…

గోవా ముఖ్యమంత్రి మనోహర్_పారికర్ గారి వ్యక్తిత్వం..

ఒక సామాన్య ముఖ్య మంత్రి. అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు.ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది.
ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు. ఆయన్ని గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినపుడు యావత్ గోవా కంట తడి పెట్టింది.

రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం జుగుప్స ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు.

ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తారు. బడ్డీ కొట్టు లో టీ తాగేస్తారు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటారు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తారు.

గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది. కార్ ఆగింది ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పారట సెక్యూరిటీ.

తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట .వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్య మంత్రి అని చెబితే అవాక్కయ్యాడట..

అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారు ఆ రాష్ట్ర ప్రజలు. ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి.అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి ఈఈట్ పట్టా పొందిన పారికర్.

మనకు ఇటువంటి నాయకులు కావాలి. కోట్లకు కోట్లు దోచుకొనే నాయకులు కాదు. ప్రజాస్వామ్యమంటే సెక్యూరిటీ గార్డులను వెనకేసుకొని తిరిగేవారు కాదు …..

దేశం ఒక గొప్ప నాయకుడిని  కోల్పోయింది….

WE MISS A GREAT LEADER…జైహింద్ …