టీడీపీలో “ఆ స్థానాలు”… ఎవరికి దక్కేనో…??

వాస్తవం ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ తరఫున కోటి చేయబోయే అభ్యర్థులను దాదాపు ప్రకటించేశారు. అయితే ఇంకా 30కి పైగా ఎమ్మెల్యే స్థానాలలో అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆయా స్థానాల నుంచి పోటీ చేయడానికి ఆశక్తి చూపుతున్న ఆశావహులలో గుబులు రేపుతోంది. చంద్రబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక తెగ కంగారు పడిపోతున్నారు నేతలు. దాదాపు ఆ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు అయిపోయారని తెలుస్తోంది..ఇదిలాఉంటే

నామినేషన్ల ప్రక్రియకి ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల్లో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. ఈ సమయంలో అధినేత ఇంకా తుది జాబితాను ప్రకటించకపోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. జాబితాను విడుదల చేయటం చంద్రబాబు కి పెద్ద విషయం కాకపోయినా, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నారట..ఎందుకంటే..

ఇప్పటికే ఆయా స్థానాలలో అభ్యర్ధిత్వం విషయంలో ఒకరి తరువాత ఒకరు తీవ్రస్థాయిలో రికమండేషన్లు తీసుకువచ్చారట. ఆయా స్థానాలలో టిక్కెట్లు ఆశిస్తున్న వారందరూ కూడా రేపు అటూ ఇటూ అయితే చంద్రబాబు పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవాళ్ళే దాంతో ఏమి చేయాలో వారికి టిక్కెట్లు ఇస్తే మిగిలిన వారిని ఎలా సముదాయించాలో, వారికి ఎలాంటి భరోసా ఇవ్వాలో తర్జన భర్జన పడుతున్నారట బాబు.

అయితే ఇదే విషయంలో చంద్రబాబు నాయుడు పార్టీలోని కీలక సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి ఆయా స్థానాలలో ఎలాంటి వ్యూహాలు రచించాలో చర్చలు జరుపుతున్నారట. అంతేకాదు. ఇప్పటికే టిక్కెట్లు రాకపోవడంతో ఎంతో మంది ఆశావాహులు, టీడీపీలో కీలక నేతలు పార్టీని విడిచి వైసీపీలోకి వెళ్లిపోవడంతో కుదేలయిపోతున్న టీడీపీ కీలక సమయంలో చివరి జాబితా అభ్యర్ధులు గొడవలు చేస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని భావించిన చంద్రబాబు వారిని ఎలా డీల్ చేయాలో ఆలోచనలో పడ్డారట.