రష్మీక సినిమా ను తన ఖాతాలో వేసుకున్న రకుల్..!

వాస్తవం సినిమా: మొన్నటిదాకా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో జత కడుతూ క్రేజ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ కి రష్మిక ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా చెక్ పెట్టింది. సౌత్ ఇండస్ట్రీలో దూసుకెళ్ళిపోతున్న రకుల్ కి రష్మిక ఎంట్రీతో చాలా అవకాశాలు చేజారిపోయాయి అని ఇండస్ట్రీలో ఉన్న టాక్. అయితే తాజాగా మాత్రం రేష్మి క కి వచ్చిన అవకాశాన్ని…రకుల్ తన ఖాతాలో వేసుకున్నట్టు తెలుగు సినిమా రంగంలో టాక్ వినపడుతోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఆ టాపిక్ కూడా అయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే..సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం చిత్రలహరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక చిత్రలహరి తర్వాత సాయి ధరమ్ తేజ్, మారుతీ దర్శకత్వంలో మరో మూవీ కమిట్ అయిన సంగతి తెలిసందే.ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. ఇందుకోసం చాలా లావు కూడా తగ్గరట తేజు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న రష్మిక మందన్న అయితే బావుంటుందని మారుతీ అనుకున్నాడట.. కానీ రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్తో ఫుల్ బిజీ. కొన్ని సినిమాలను డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక వదులుకుందనే టాక్ ఉంది. అందుకే విన్నర్ లో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన రకుల్ ప్రీత్ ని మారుతీ – సాయి ధరమ్ సినిమా కోసం ఎంపిక చెయ్యబోతున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేని ఈ భామ కి సాయి ధరం సినిమాలో అవకాశం రావడం రష్మిక పుణ్యమే అంటున్నారు…సినిమా విశ్లేషకులు.