కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసిన వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు

వాస్తవం ప్రతినిధి: కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు.అంతిమయాత్రలో వైఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పులివెందులలోని రాజారెడ్డి ఘాట్ లో వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. వైయస్ రాజారెడ్డి ఘాట్ లో ఈ ఉదయం 11 గంటలకు అంత్యక్రియలను నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ సహా కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.