వాస్తవాలు దాచి మాపై ఆరోపణలు చేస్తారా..??

వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిలో వాస్తవాలు దాచి మాపై ఆరోపణలు చేస్తారా అని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఉదయం వివేకానందరెడ్డి మరణవార్త వినగానే బాధ కలిగించిందన్నారు. మొదట గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగిందన్నారు. వివేకానందరెడ్డి మృతిపై వైసీపీ నేతలు రాజకీయం చేశారన్నారు. బాత్రూంలో చనిపోయారని మొదట చెప్పారన్నారు. బెడ్రూంలో తలకు కట్టు కట్టారన్నారు. బ్లడ్ క్లీన్ చేసిన తర్వాత ఆస్పత్రికి తరలించారని చంద్రబాబు తెలిపారు.