నవ్వుల పాలవుతున్న టీడీపీ పసుపు కుంకుమ యాడ్..!!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీల ప్రచార పర్వం కూడా ఊపందుకుంది.తన డప్పు తానూ కొట్టుకోవడంలో, అందుకు మీడియాని వాడుకోవడంలో దిట్టగా పేరొందిన చంద్రబాబు గారు అందుకు తగ్గట్టుగా కాకలు తిరిగిన యోధులతో ప్రచారం యాడ్స్ చేయించారు. ప్రతీ దానికి బాబే రావాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నారు కానీ అసలు యాడ్స్ ఎలా వచ్చాయో ఫైనల్ స్క్రీన్ టెస్ట్ చేయలేదు కాబోలు అన్ని యాడ్స్ లో ఒక యాడ్ మాత్రం టీడీపీ పరువు పోగొట్టేస్తోంది.

చంద్రబాబు నాయుడు అధికార పార్టీ హోదాలో తాము ప్రజల కోసం ఏర్పాటు చేసిన పధకాలని ఈ ఎన్నికల్లో యాడ్స్ రూపంలో తీసుకువెళ్ళి మళ్ళీ అధికారం సాధించాలని అనుకుంటే చివరికి నవ్వుల పాలవుతోంది. చంద్రబాబుకి ఎంతగానో పేరు తీసుకు పధకం , డ్వాక్రా మహిళల కోసం ఏర్పాటుచేసిన   పసుపు కుంకుమ. ఈ పధకంపై రూపొందించిన యాడ్ ఇప్పుడు ఏపీ ప్రజలని తీవ్రంగా నవ్విస్తోంది.

అసలు ఎటువంటి పార్టీ అయినా సరే ప్రచారంలో భాగంగా ఆయా పార్టీలు విడుదల చేసే పోస్టర్లు గాని , నినాదాలు, వీడియోలు, ఒకటికి పదిసార్లు చూసుకొని జాగ్రత్తగా విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తరువాత తప్పులు దొర్లితే మాత్రం నవ్వుల పాలు కావడం ఖాయం ఇప్పుడు ఇదే టీడీపీ ని సోషల్ మీడియాలో ఏకేస్తోంది. ఇంతకీ పసుపు కుంకుమ ఎందుకు నవ్వుల పాలయ్యింది అంటే..

ఆ యాడ్ లో డ్వాక్రా మహిళగా ఉన్న ఆమె ఒక ఆవుని, దాంతో పాటు పిల్లని తీసుకువచ్చింది. ఒకటి రెండు సెంటిమెంట్ డైలాగులు చెప్పింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా కెమెరామెన్, డైరెక్టర్ తమ ప్రతిభని ప్రజలకి చూపించుకునే క్రమంలో ఆమె కుటుంభాన్ని, ఆవుని లాంగ్ షాట్ తీశారు. దాంతో అది ఆవు కాదు కోడెద్దు అని వీడియో చూసిన నెటిజన్లు గ్రహించి పగలపడి నవ్వుకుంటున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేస్తూ ఎద్దుకి పసుపు కుంకుమ ఏంటీ, ఇంకా నయ్యం పాలు పితకలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ అసలు సంగతి..ప్రచారం ఏమో కాని నవ్వులు పాలు కాకుండా ఉంటే చాలు అంటున్నారు జనాలు…