పశ్చిమగోదావరి పై లేటెస్ట్ సర్వే…???

వాస్తవం ప్రతినిధి: మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా గా ఏపీలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను ఢీ కొట్టడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా టిడిపి , జనసేన పార్టీలు తమ తమ అభ్యర్థుల మొదటి జాబితాలను ప్రకటించడం, వైసిపి అధినేత జగన్ రెడ్డి గతం లోనే కొందరు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ మూడు పార్టీలు తీసుకున్న నిర్ణయాలతో పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలలో కీలక మార్పులు సంభవించాయని అంటున్నారు విశ్లేషకులు.

ఏపీలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే ముందుగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ నీ క్లినిక్ స్వీప్ చేయాల్సిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న త్రిముఖ పోరు లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పశ్చిమలో గెలుపెవరిది అంటూ జరిగిన సర్వేలో లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. గత ఎన్నికల్లో పశ్చిమ నుంచి టిడిపి పార్టీ 15 స్థానాలకు గాను 15 స్థానాలు గెలుపొంది రికార్డ్ క్రియేట్ చేసింది..

కానీ గత ఎన్నికలలో ఉన్న ఊపు టీడీపీ కి ప్రస్తుతం లేదని ఈసారి పశ్చిమ నుంచీ టీడీపీ అతి తక్కువ స్థానాలు గెలవనుందని తాజా సర్వే తేల్చి చెప్తోంది. ఈ సర్వే లెక్కల ప్రకారం ఈసారి పశ్చిమ నుంచి టిడిపి 4 సీట్లు మాత్రమే గెలుపొందే అవకాశం ఉందని తేల్చి చెప్పిందట. ఇక ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే పశ్చిమ లో గతంలో ఒక్క సీటు కూడా గెలుచుకోని జగన్ ఈ సారి ఏకంగా ఏడూ స్థానాలని గెలుచుకోబోతున్నారని తెలిపింది. అంతేకాదు వైయస్ జగన్ ఈ సారి ఏకంగా ఏడు స్థానాలను గెలుచుకుని చంద్రబాబు కి షాక్ ఇవ్వనున్నాడట.

ఇదిలాఉంటే పశ్చిమలో పవన్ కళ్యాణ్ పక్కగా 4 స్థానాలని తన ఖాతాలో వేసుకునే అవకాశం మెండుగా ఉందట. పశ్చిమలో పవన్ 4 స్థానాలని గెలుచుకోబోతున్నాడు అంటే తూర్పు లో పవన్ తన సత్తా చాతుటాడని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే జగన్ రెడ్డి మొదటి స్థానంలో, పవన్ కళ్యాణ్ రెండవ స్థానంలో ఉండనున్నాడట. గత ఎన్నికల్లో టీడీపీ కి అధికారం కట్టబెట్టిన జిల్లాగా పేరొందిన పశ్చిమ ఇప్పుడు అదే బాబు ని గద్దె దించనుంది అంటున్నారు విశ్లేషకులు.