గెలుపే లక్ష్యంగా పని చేయాలి: ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్

వాస్తవం ప్రతినిధి:   ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్సీ యలమంచిలి వేంకట బాబూ రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. ఉయ్యూరులో మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా నిరంతరం కష్టపడే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారికి మరోసారి అవకాశం రావడం మన నియోజకవర్గ అభివృద్ధికి నిదర్శనం అని, ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ గారిని, ఎంపిగా కొనకళ్ళ నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాలుగున్నరెళ్ళ కష్టానికి అభివృద్ధికి కృతజ్ఞత చూపించాలని, మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.