మంగళగిరిలో యదేచ్ఛగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలు

వాస్తవం ప్రతినిధి: మంగళగిరిలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలు యదేచ్ఛగా జరు జరుగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిమా పాఠశాల విద్యార్థులకు శుక్రవారం సైకిల్ పంపిణీ చేశారు. కనీసం సైకిల్స్ ఎందుకు ఇచ్చారో కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి. స్వయానా మంగళగిరి ఎం.ఈ. ఓ పర్యవేక్షణలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎలక్షన్ కోడ్ సమయంలో ఏ విధంగా పంపిణీ చేస్తారని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తున్నామని చెపుతూ వెళ్లిపోయారు.