బాలీవుడ్ లో అదిరిపోయే పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్..!

వాస్తవం సినిమా: అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో నటించి ఎంతో మంది సినిమా ప్రేమికుల హృదయాలను దోచుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ నేపథ్యంలో సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బయోపిక్ లో నటించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు బాలీవుడ్లో తెగ వార్తలు వినబడుతున్నాయి. బాలీవుడ్ లో కీర్తి సురేష్ నటించబోయే ఆ బయోపిక్ లో..ఒక ఫుట్ బాల్ కోచ్‌ కి భార్య పాత్రలో కనిపించనుంది. సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ అనే ఓ దిగ్గజ ఫుట్‌బాల్‌ కోచ్‌ జీవిత కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు అమిత్‌ శర్మ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా సెలక్టయింది. ఫుట్ బాల్ కోచ్‌ కథలో హీరోయిన్‌ రోల్‌ ఏ మాత్రం ఉంటుందనేది ఊహించవచ్చు. బాలీవుడ్ సినిమా అవకాశం కాబట్టి కీర్తి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఓకే చెప్పిందట. అటు మూవీ మేకర్స్ కీర్తిని తీసుకోవడం వల్ల దక్షిణాది మార్కెట్లో ఆమె వల్ల సినిమాకి కాస్త అడ్వాంటేజ్‌ ఉంటుందని భావిస్తున్నారు. మహానటి సినిమా తరువాత కీర్తి తన ఇమేజ్ కి తగ్గ పాత్రలే చేయాలని డిసైడ్ అయ్యి చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. చూడాలి బాలీవుడ్ ఎంట్రీ కీర్తి కి ఎలా ఉండబోతుందో.