వైఎస్‌ వివేకానందరెడ్డి శరీరంపై ఏడు కత్తి గాయాలు..ప్రాథమిక నివేదికలో వెల్లడించిన వైద్యులు

వాస్తవం ప్రతినిధి: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో వెల్లడించారు. పదునైన ఆయుధంతో శరీరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులు, అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు.