బీఎస్పీ తో కలసి ఎన్నికలలో పోటీచేస్తున్నామని ప్రకటించిన పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక రాజకీయ పొత్తుకు తెరలేచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంతో రాజకీయ పరిణితి కనబరిచారు. రాజకీయ విశ్లేషకులతో సహా అందరూ ఆశ్యర్య పోయేలా పరిణితితో కూడిన, ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకొన్నాడు. అదే బీఎస్పీ తో కలసి ఎన్నికలలో పోటిచేస్తున్నామని ప్రకటించడం. నిన్న జనసేన ఆవిర్భావ సభ అనంతరం ఆయన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకొని బీఎస్పీ అధినేత్రి మాయావతి తో ఎన్నికల పొత్తుపై చర్చలు జరిపారు. చర్చలు పలవంతం అయిన తరువాత జనసేన, బిఎస్పీ కలసి ఎన్నికలలో పోటిచేస్తున్నాయని మీడియా ముందు ప్రకటించారు. అంబేడ్కర్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమని పవన్‌ అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు

సామాజిక న్యాయమే ప్రధానంగా ఏర్పడ్డ జనసేన పార్టీకి, బలహీన వర్గాలలో మంచి అండదండలు వున్న బిఎస్పీ అండ దొరకడం సంతోషదాయకమైన అంశమే. పార్టీకి బలహీన వర్గాలలో పట్టు లేదన్న కొరత ఈ నిర్ణయం ద్వారా తీరనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు SC లోని అభిప్రాయ బేధాలను సాకుగా చేసుకొని ఆడే నాటకాలకు తెరపడనుంది. ఒక పార్టీ నాయకుడు మత మార్పిడి ద్వారా ఒక SC వర్గం వాడినని చెప్పుకొని ఓట్లు దండుకోవడం, దానిని సాకుగా చూపి రెండవ ప్రధాన పార్టీ రెండవ sc వర్గం వారి వోట్లు దండుకోవడం తప్ప వారికి ఏమి ఓరగ బెట్టని సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి ఈ నిర్ణయంతో ఆయా వర్గాల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.