50% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పిటిషన్ విచారణ 25కు వాయిదా

వాస్తవం ప్రతినిధి: ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ 21 మంది ప్రతిపక్ష నేతలు సంతకాలు చేసిన పిటిషన్‌ పై సుప్రీం కోర్టు ఈ రోజు విచారించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా 21 పార్టీలకు చెందిన నాయకులు ఈ పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ రోజు విచారించిన సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.