ప్రజాభిప్రాయంతోనే టిడిపి అభ్యర్థుల ఎంపిక జరిగింది: చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: టిడిపి అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నామని ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా బిడ్డింగ్‌ విధానం అమలు చేస్తోందని ఆయన చెప్పారు.పోలవరం విషయంలో ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌తో వైకాపా లాలూచీ పడిందని ఆయన అన్నారు. జన్మభూమికి వైకాపా అన్యాయం చేస్తోందని ఆయన విమర్శించారు.