వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం

వాస్తవం ప్రతినిధి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది.

వివేకానంద రెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు.