ఖరారైన టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరే ?

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు… సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఖరారైన అభ్యర్థుల జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది. 126 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు… మిగతా అభ్యర్థుల ఎంపికతో పాటు లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
ఇక టీడీపీ తరపున దాదాపుగా ఖరారైన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అశోక్ గజపతిరాజు
అరకు – కిశోర్ చంద్రదేవ్
కాకినాడ – చలమలశెట్టి సునీల్
విజయవాడ – కేశినేని నాని
గుంటూరు – గల్లా జయదేవ్
నరసరావుపేట – రాయపాటి సాంబశివరావు
బాపట్ల – తెనాలి శ్రావణ్ కుమార్
ఒంగోలు – శిద్దా రాఘవరావు
తిరుపతి – పనబాక లక్ష్మీ
చిత్తూరు – శివప్రసాద్
అనంతపురం – జేసీ పవన్ కుమార్ రెడ్డి
హిందూపురం – నిమ్మల కిష్టప్ప
కర్నూలు – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కడప – ఆదినారాయణరెడ్డి.
విశాఖపట్నం నుంచి బాలకృష్ణ రెండో అల్లుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడికి టికెట్ దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక అనకాపల్ల నుంచి అడారి ఆనంద్ పోటీ చేసే అవకాశాలు ఉన్నా… ఈ విషయంలో చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజమండ్రి టికెట్ మురళీమోహన్ కోడల రూపాదేవికి లేదా ముళ్లపూడి రేణుకకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అమలాపురం టికెట్‌ను బాలయోగి తనయుడు హరీశ్ మాధుర్‌కు ఖరారైనట్టు వార్తలు వచ్చినా… మాజీ ఎంపీ హర్ష్ కుమార్ పేరు చివర్లో తెరపైకి వచ్చింది. నరసాపురంలో అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ పోటీ చేస్తారా లేక వంగవీటి రాధాకృష్ణకు అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. నెల్లూరు నుంచి పోటీలో ఎవరుంటారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజంపేట బరిలో నిలిచేది ఎవరనే అంశంపై కూడా సస్పెన్స్ నెలకొంది. నంద్యాల బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.