వివేకా మృతిపై దర్యాప్తు కోరాము: విజయసాయిరెడ్డి

వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయని వైకాపా నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమకెంతో ముఖ్యుడైన వివేకా మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులమంతా దీనిపై లోతైన దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.   ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? లేక దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే తేలుతుందని, దానికోసమే వేచిచూస్తున్నామని చెప్పారు. వివేకా మృతిచెందిన వేళ, రాజకీయాలు వద్దని, నేడు లేదా రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.