మంగళగిరిలో పర్యటిస్తున్న నారా లోకేష్

వాస్తవం ప్రతినిధి: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న నారా లోకేష్ ఈ రోజు మంగళగిరిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ఆ తరువాత మసీదు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాయల్ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.