వైఎస్ వివేకా మరణం పై పోలీసులకు వివేకా పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు

వాస్తవం ప్రతినిధి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్యకు గురయ్యారని భావిస్తున్నారు.వివేకానంద గుండెపోటుతో మరణించారని ముందు భావించారు.కానీ వివేకా మరణం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండడమే కాక తల మీద, చేతికి బలమైన గాయాలు తగలడం, మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో ఆయన పిఎ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్‌ డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. మరికొద్దిసేపట్లో వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది.