“పవన్”… ఇచ్చిన క్లారిటీ సరిపోద్దా..“చంద్రబాబు”..???

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి ముగ్గురు ఒక్కటే, ఎపీకి అన్యాయం చేసి రాష్ట్రాన్ని విడగొట్టిన కేసీఆర్ తో కలిసి పవన్ , జగన్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ టీడీపీ చేసిన ఆరోపణలు ఒకానొక సమయంలో బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి. అయితే అప్పటి నుంచీ సైలెంట్ గా టీడీపీ చేస్తున్న రాజకీయాలని మౌనంగా భరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున ఆవిర్భావ వేదిక మీదుగా తిప్పికొట్టారు.

కేసీఆర్ మీకో నమస్కారం రెండు చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రులని తిట్టారు, ఇక ఆంధ్రులను వదిలేయండి అంటూ పవన్ కేసీఆర్ ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో టీడీపీకి మబ్బులు విడిపోయాయి. కేసీఆర్‌ గారు మీరు ఉద్యమానికి నాయకత్వం వహించారు. తక్కువ హింసతోనే రాష్ట్రాన్ని సాధించారు. మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. మీ గొడవల వల్ల ప్రజలని శిక్షించకండి అంటూ పవన్ కామెంట్స్ చేశారు.

అంతేకాదు పనిలో పనిగా కేసీఆర్ ,జగన్ ల మధ్య ఉన్న లాలుచీని కూడా పవన్ ఎండగట్టారు. తెలంగాణ విడిపోతే ఏమవుతుందో వైఎస్‌ చెప్పిన విషయం జగన్ మీరు మర్చిపోయారా తండ్రి మీ తండ్రి మాటపై మీకు గౌరవం లేదా అంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో చంద్రబాబు , జగన్ , మేము పోటీ చేయవచ్చు అది మన మధ్య ఉన్న విషయం ఇందులోకి కేసీఆర్ ని ఎందుకు తీసుకువస్తున్నారు. అంటూ జగన్ పై మండిపడ్డారు జనసేనాని.

బీజేపీ , టీఆర్ఎస్ తో నాకంటే ఎక్కువ స్నేహం మీకు లేదు, అలాంటిది రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బకొట్టిన వారితో నేను విభేదించి బయటకి వచ్చాను. మరి ఏ ఉద్దేశ్యంతో వారితో చేతులు కలుపుతున్నారు. ఏపీ ప్రజల మనోభావాలతో మీకు పనిలేదా అంటూ పవన్ ఫైర్ అయ్యారు.దాంతో టీడీపీ పవన్ పై చేస్తున్న ప్రచారానికి ఏపీ ప్రజలకి పవన్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఎన్టీఆర్‌ 60ఏళ్ల తర్వాత మనుమలు పుట్టాక మార్పు కోసం వచ్చారని నేను తాను స్టార్‌డమ్‌ ఉండగానే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలకి దారి తీస్తోంది.