వివేకానందరెడ్డి మృతిపట్ల అనుమానాలపై స్పందించిన సీఎం చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపట్ల అనుమానాలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు, కడప జిల్లా పోలీసు అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. వివేకానందరెడ్డి మృతిపై అత్యున్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.