“రాజకీయ పండితులని”.. విస్మయానికి గురిచేసిన…జనసేనాని..!!!

 వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత నిన్నటి రోజున పార్టీ ఆవిర్భావ సభలో అశేష అభిమాన కార్యకర్తల నడుమ ప్రకటించిన జనసేన మేనిఫెస్టో పై రాజకీయ పరిశీలకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది రాజకీయ మేనిఫెస్టో కాదని ప్రజా మానిఫెస్టో అని, పవన్ తానూ చేసిన పర్యటనలలో ప్రజలకి ఏమి కావాలో చక్కగా గ్రహించాడని కితాబు ఇచ్చారు. జనసేన పార్టీ పూర్తిస్థాయి మానిఫెస్టో వివరాల్లోకి వెళ్తే..రైతులకి, సామాన్యులని, ప్రతిభావంతులకి పట్టం కట్టే విధంగా ఎంతో ప్రజా రంజకంగా ఉందని చెప్పడంలో సందేహం లేదనేది రాజకీయ పండితుల అభిప్రాయం.

AGRICULTURE

–      60 సంవయస్సు పైబడిన సన్నకారు, చిన్నకారు మరియు కౌలు దారులకు నెలకు రూ. 5000 పెన్షను.

–      రైతులను సంపన్నులను చేయుటకు ప్రభుత్వ సహాయంతో జోన్స్ ఏర్పాటు.  ఏర్పాటు చేసి వాటిలో రైతులను భాగస్వాములను చేయడం.

–      ఉభయగోదావరి జిల్లాలలో రూ. 5000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్ట్  ఏర్పాటు చేసి ఆహార ధాన్యాల మరియు పండ్ల, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకునే అవకాశం కలిపించడం –

–      ప్రతీ మండలంలోను గిడ్డంగులుశీతలీకరణ నిల్వయూనిట్లువ్యవసాయ ఆహార తయారీ యూనిట్లు ఏర్పాటుచేయబడును.

–      రైతులకు ఉచిత సోలార్ మోటార్స్. 

–       ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు త్రాగునీటి సదుపాయం కొరకు వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మించబడునురాయల సీమను సౌభాగ్యవంతం చేయుటకు అధునాతన వ్యవసాయ కపద్ధతులను ప్రవేశపెట్టుట.

–      మరియు ఉత్తరాంధ్రను సుభిక్షంగా తయారుచేయుటకు నదులను అనుసంధానం చేసి నూతన రిజర్వాయర్లు నిర్మించుట.

EDUCATION

–      ఒకటవతరగతినుండిపీజీకోర్సువరకుఉచితవిద్య,ఉచితబస్పాస్సౌకర్యంకల్పించబడునుమరియుప్రభుత్వకళాశాలలలొవిద్యార్థులకు ఉచిత క్యాంటిన్లుఏర్పాటుచేయబడును మరియు జూనియర్ కాలేజీలు స్థాయి నుండీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్

–      ప్రతీ అసెంబ్లీనియోజకవర్గంలోఒక ఆర్ట్స్అండ్సైన్సుకాలేజీ,  వ్యవసాయ కాలేజీ,  పాలిటెక్నిక్కాలేజీ ఏర్పాటుచేయబడును.

  •  అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీపరీక్షలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫీజు వసూలు మరియు అన్ని సామాజికవర్గాల విద్యార్థినీ,విద్యార్థులకు సర్వసమత్వ వసతిగృహాలు ఏర్పాటు చేయబడును.

–      అన్ని వృత్తి పరకళాశాలల్లో ఇన్నోవేటివ్ హాబ్స్ మరియు ఇన్క్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు. 

HEALTH

–   బడ్జెట్ పెంపు  మరియు రూ. 10,00,000వరకు అందరికి ఉచిత ఆరోగ్య భీమా కల్పించబడును. దశలవారీగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ , 30 పడకల హాస్పటల్ , ప్రతీ మండలానికి మొబైల్ డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఏర్పాటు. 

EMPLOYMENT

–      ఏపీపీఎస్సీ  క్యాలెండర్ ఏర్పాటు చేయబడును,

–      ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ మరియు అన్నిప్రభుత్వఉద్యోగాలను యుద్ధప్రాతిపదికన ఆరునెలల్లో భర్తీ చేయబడును.  

–      రూ. 10000 కోట్ల రూపాయల నిధి తో నూతన పారిశ్రామికవేత్తలకు సహాయం కొరకు వెంచర్కాపిటల్ఫండ్ ప్రతిసంవత్సరం యువతీ ,యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించబడును.

–      చిన్నతరహామధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక సదుపాయం చేయబడును. విదేశీ పెట్టుబడులతో ప్రతీ పరిశ్రమకు తగిన స్పెసిఫిక్ ఎకనామిక్జోన్ ఏర్పాటు చేయబడును.

WOMEN

–      మహిళలకు రాష్ట్ర అసెంబ్లీలో 33% శాతం అవకాశం కల్పించుట 

–      అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో స్వయం ఉపాధిసంఘాల మహిళలకు అవకాసం కల్పించబడును.

–      గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ప్రతీ సంక్రాంతికి ఆడపడుచులకు చీరల పంపిణి మరియు రేషన్ కి బదులుగా మహిళల ఖాతాల్లోరూ. 2500 నుండి 3500 వరకునగదు జమ.

–      ప్రతిజిల్లాలో ఒక మహిళాబ్యాంకు  మరియు ప్రతిజిల్లాకి మహిళా ఆరోగ్యస్పెషాలిటీ ఆసుపత్రినిర్మాణం.

–      ప్రతిమండలానికి ఒక కల్యాణమండపం నిర్మాణం. మహిళా ఉద్యోగినుల సౌకర్యార్ధం ఏర్పాటుచైల్డ్ అండ్ రూమ్స్ ఏర్పాటు చేయబడుట. 

DEVELOPMENT

–      అవకాశాన్నిబట్టి బీసీలకు 5% రిజర్వేషన్లు మరియు రాజకీయ రిజర్వేషన్లు కల్పించబడును.

–      కాపులకు 9 వషెడ్యూలు ద్వారా రిజర్వేషన్లు కల్పించబడును.

–      SC వర్గీకరణకు సామరస్య పరిష్కారం.

–      ముస్లింల అభివృద్ధికి సిఫారసులనుఅమలుచేయబడును.

OLD AGE

–      ప్రభుత్వఉద్యోగులకు CPS విధానంరద్దు.

–      వృద్ధులను ఆదుకొనుటకు ప్రభుత్వ వృద్ధాశ్రమములను ప్రతిమండలంలోనూ నడుపబడును.

WELFARE 

–      ప్రభుత్వసంస్థలలో సమాన పనికి సమానవేతనం అమలుచేయబడును.

–  అర్ధరూపాయి వడ్డీతో బంగారు నగలతాకట్టు రుణాలు మంజూరు చేయబడును, ఆరుణాన్ని ఒకసంవత్సరంలోపు  అసలు +వడ్డీతో కలిపి చెల్లించే వారికివడ్డీని పావలా వడ్డీగా తగ్గించబడును.

–      చిరు వ్యాపారులకు ఏవిధమయిన పూచిలేకుండా రూ. 5000 వరకు పావలావడ్డీ రుణసదుపాయం చేయబడును.

–    బహుళ అంతస్థుల అపార్టుమెంటులను నిర్మించి ప్రతికుటుంబానికి గృహాన్ని ఉచితంగా ఇవ్వబడును 

FISHERIES

–      మత్య కారుల కోసం బ్యాంకు ఏర్పాటు.

–      పశుసంవర్ధనపాడి పరిశ్రమాభివుద్దిమత్స్య పరిశ్రమలకు పూర్తిస్థాయిలో మద్దతు.

–       మత్స్యకారుల సంక్షేమం మరియు మత్స్యపరిశ్రమాభివృద్ధితో డ్పాటుకల్పించబడును.

–    300 రోజుల ఉపాధికల్పనబ్రేక్ పీరియడ్ లో మరియు తుఫానుల హెచ్చరిక సమయంలో చేపలవేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ.500ఆర్ధిక సదుపాయం కల్పించబడును.

  •  అన్ని మత్స్యకారుల గ్రామాలకు రెండు సం ..లోపు సురక్షిత మంచినీటి సరఫరా చేయబడును. పర్యాటక ప్రోత్సాహం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించుట.

FOR RELLIS

– రెల్లి యువత స్వయం ఉపాధి కొరకు రూ.50000  వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయంకల్పించబడును.

–      రెల్లి కార్మికులకు ఆటో రిక్షా కొనుగోలు కొరకు 50%

–      సబ్సిడీపేరుణసదుపాయం. మరియు ప్రైవేటు సంస్థలలో పని చేయుచున్న రెల్లి వనితలకు ఉచిత స్కూటరు. ఉచిత గృహ సదుపాయం.

LOCAL GOVERNMENTS

–      గ్రామీణాభివృద్ధికి డా.అబ్దుల్ కలాం ఆశయమైన పుర స్కీమ్స్ అమలు చేయబడును. –

–     గ్రామాలూ అన్నింటిలో నగరవసతులు కల్పించబడును. ప్రతి 5 సంకు స్థానిక సంస్థలకు ఎన్నికలు        మరియు 73 , 74 రాజ్యాంగసవరణల అమలు.