కలుషిత ఆహారం తిని 35మంది విద్యార్థినులకు అస్వస్థత

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ లోని శాలిబండలో గల మైనారిటీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన ఆహారం తిని 35మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఆస్పత్రికి తరలించారు. సెక్రటరీ షఫివుల్లా నిర్లక్ష్యం తోనే ఇలా జరిగిందని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. షఫివుల్లా ను తొలగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.