శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో మల్లారెడ్డికి వేదపండితులు వేదశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మల్లారెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సుఖఃసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు మల్లారెడ్డి చెప్పారు.