ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సలహాదారుగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ

వాస్తవం ప్రతినిధి:వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సలహాదారుగా టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ నియమితులయ్యారు. ఈ మేరకు జట్టు యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పనిచేయనున్నందుకు సంతోషంగా ఉందని, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సంస్థల గురించి చాలా ఏళ్లుగా తెలుసని, వారి క్రీడా ప్రస్థానంలో కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని గంగూలీ అన్నాడు. ‘గంగూలీ అనుభవం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉంది’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్ వ్యాఖ్యానించారు. ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పనిచేయనున్నారు.