సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బహుభాషా చిత్రం “హీరో”

వాస్తవం సినిమా: శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి గొప్ప హిట్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీస్ సంస్థ ఇప్పుడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇంకొక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే నిర్మాణ సంస్థ డియర్ కామ్రేడ్ అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండతో నిర్మిస్తోంది. ఇది నిర్మాణ దశలో వుండగానే, మరొక చిత్రాన్ని విజయ్ దేవరకొండతో నిర్మించడానికి ఉపక్రమించింది.

ఈ చిత్రానికి “హీరో (HERO)” అన్న పేరు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తారు. ఇది బహుబాషా చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఏకకాలంలో దీనిని తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ భాషలలో నిర్మిస్తున్నారు. రిగులర్ షూటింగ్ ఏప్రిల్ 22న న్యూ డిల్లీలో మొదలవుతుంది అని నిర్మాతలు తెలిపారు.

షూటింగ్ మొదలయ్యే లోగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తామని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. శంకర్ మరియు మోహన్ లు తెలిపారు. దీనికి సంభందించి నాయక, ఇతర నటీ నటుల వివరాలు తెలియాల్సివుంది.

అదే చిత్ర నిర్మాణ సంస్థ క్రింద ఇంకా చిత్రలహరి, పంజా, గ్యాంగ్ లీడర్, మరియు AA20 చిత్రాలు రూపుదిద్దు కొంటున్నాయి.