సాహో చిత్రం భారతీయ భాషలలో యాక్షన్ చిత్రాల తీరునే మార్చివేయనుందా?

వాస్తవం సినిమా: బాహుబలి చిత్రాల విడుదల తరువాత భారతీయ భాషలలో తెలుగు సినిమా ముఖచిత్రమే మారిపొయినది. ప్రస్తుతం బాహుబలి అంటే తెలుగు చిత్రం కాదు భారతీయ చిత్రం అన్నంతగా పరిస్థితిలో మార్పు వచ్చింది. నిర్మాతలకు ఇప్పుడు తెలుగు చిత్రాలమీద నమ్మకం ఎంతగా పెరిగింది అంటే ఎంత ఖర్చుకు అయినా వెనుకాడటం లేదు. బాహుబలి వసూళ్లు ఆవిధంగా కనక వర్షం కురిపించాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్తాయి లో స్టార్ గా ఎదిగాడు. దేశం మెత్తం మీద అభిమానులను సంపాదించుకొన్నాడు.

నిర్మాతలకు ప్రభాస్ మీద నమ్మకంతో ఎంత ఖర్చుకు అయినా వేనుకాడుటలేదు అనుటకు సాహో చిత్రం ఎలా రూపొందిస్తున్నారు అన్న దాని మీద విడుదల చేసిన వీడియోకి వచ్చిన ప్రతిస్పందన చూస్తేనే తెలుస్తుంది. గత సంవత్సరం విడుదల చేసిన షేడ్స్ అఫ్ సాహో మెదటి చాప్టరుకి అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం విడుదల చేసిన చాప్టరు రెండుకి కూడా సోషల్ మీడియాలో అత్యద్బుతమైన ప్రతిస్పందన వస్తుంది. ఒక్క రోజులోనే యుట్యూబ్ లో 12 మిలియన్ వీక్షణాలతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన విడియోగా రికార్డుకు ఎక్కింది. అంతే కాకుండా ఒక్క రోజులోనే 3 మిలియనుల లైకులు వచ్చిన విడియోగా చరిత్ర సృష్టించింది..

ఈ సినిమా చిత్రీకరణ కోసం ప్రపంచంలో ఉన్న గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ఇది ఒక గొప్ప యాక్షన్ థ్రిల్లర్ గా మలుస్తున్నారు. తెలుగు మరియు భారతీయ సినిమా పరిధులను సాహో చిత్రం ఫలితం మార్చి వేస్తుందని ఆశిద్దాం.