ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవికి హైకోర్టులో ఊరట

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల నియమావళి విరుద్ధంగా 2014 ఏప్రిల్‌ 27న రాత్రి 10 గంటలు దాటినా ఎన్నికల ప్రచారం చేశారంటూ గుంటూరు అరండల్‌పేట పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీనిపై చిరంజీవి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈక్రమంలో జరిగిన విచారణలో ఇరు పక్షాల వాదనను విన్న న్యాయస్థానం.. కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.