‘డబ్బు, పేరు ఎప్పుడూ నాకు ఆనందం ఇవ్వలేదు’ : పవన్‌కల్యాణ్‌

వాస్తవం ప్రతినిధి: డబ్బుంటే చాలు గెలవొచ్చనే పరిస్థితుల్లో ఉన్నామని, డబ్బు, పేరు తనకు ఎప్పుడూ ఆనందం ఇవ్వలేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. రాజమహేంద్రవరం లో జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన ఆయన మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి చూడలేనన్నారు. ‘‘జనసేనను స్థాపించినప్పుడు నేనొక్కడినే… ఇప్పుడు సైన్యం ఉంది. తెలుగు ప్రజల సుస్థిరత కోసమే గతంలో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చా. అడుగేస్తే తలతెగాలి కానీ… వెనుకడుగు వేయను. నాలుగేళ్లుగా ఎంత తిట్టినా, బెదిరించినా వెనక్కి తగ్గలేదు. రూ.వేల కోట్లు ఉంటేనే రాజకీయాల్లో రాణించగలమన్నారు. టీనేజీ యువతే నీ దగ్గర ఉంది… ఎలా గెలుస్తావన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకున్నాను. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరు. వైసీపీ అధినేత జగన్‌ విధానాలను ప్రశ్నిస్తే… నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారు’’ పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు.