మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించి ఇమ్రాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలి: సుష్మా స్వరాజ్

వాస్తవం ప్రతినిధి: ఉగ్రవాదం లేని వాతావరణం కోసం పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజనీతజ్ఞుడిగా చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారని… జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను భారత్ కు అప్పగించి ఇమ్రాన్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. అప్పుడే ఆయనలో ఎంత ఉదారత ఉందో అర్థమవుతుందని చెప్పారు. ఉగ్రవాదం, చర్చలు రెండూ కలసి ముందుకు సాగవని అన్నారు. ఉద్రిక్తతలను నివారించడానికి భారత్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, ఇదే సమయంలో పాకిస్థాన్ నుంచి సరైన చర్యలను భారత్ ఆశిస్తోందని చెప్పారు. ఇదే సమయంలో, పుల్వామా తరహా ఘటన మరోసారి చోటుచేసుకుంటే… తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పానని అన్నారు.