జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించిన జనసేనాని

వాస్తవం ప్రతినిధి: పవన్ కల్యాణ్ రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకుని జనసేన మేనిఫెస్టో రూపొందించినట్టు అర్థమవుతోంది. అంతేకాకుండా, మహిళలు, విద్యార్థులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు

రైతు రక్షక భరోసా పథకంలో భాగంగా 60 ఏళ్లు పైబడిన అన్ని వర్గాల రైతులకు నెలకు రూ.5,000 పింఛను
రైతుకు ఎకరానికి రూ.8000 సాగు సాయం
భూములు కోల్పోయిన కుటుంబాలకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం చెల్లింపు
రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు
రాష్ట్ర పారిశ్రామికీకరణలో రైతులకు భాగస్వామ్యం
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోసం రూ.5,000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు
ప్రతి మండలంలో గోడౌన్లు
ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం
విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పేరుతో భోజన క్యాంటీన్లు
ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజక్ట్ సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు
ఉత్తరాంధ్రలో నదులు అనుసంధానంపై ప్రత్యేక ఏర్పాట్లు
లంచాలు తీసుకునే వీల్లేకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
అనేక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఏడాదికి ఒక్కసారి ఫీజు కట్టించుకునే విధానం
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించేలా చర్యలు
మహిళలకు పావలా వడ్డీతో రుణాలు అందజేత
ప్రతి జిల్లాలో మహిళలకు ఆసుపత్రి, ప్రత్యేక బ్యాంకు
డ్వాక్రా మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ
బీసీలకు 5 శాతం రిజర్వేషన్లు వర్తింపు
ముస్లిం సోదరుల కోసం సచార్ కమిషన్ సిఫార్సులు అమలు