చంద్రబాబు పై కన్నా సెటైర్లు

వాస్తవం ప్రతినిధి: ఎన్నిక‌లు ముంచుకొస్తున్న స‌మ‌యంలో భాజాపా, టీడీపీ మ‌ధ్య రాజ‌కీయ వాతావ‌ర‌ణం హీటెక్కింది. గత ఎన్నికల్లో కలిసి పోటీచేసినా టీడీపీ-బీజేపీ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. తాజాగా సీఎం చంద్ర‌బాబుపై భాజాపా అధ్య‌క్షుడు క‌న్నా మ‌రో సారి ట్విట్ట‌ర్ వేదిక ద్వారా సెటైర్లు వేశారు.

ప్రజలకి సమాధానం చెప్పం.. కేంద్రానికి లెక్కలు చెప్పం.. మీడియాకి నిజాలు చెప్పం.. ఐనా నన్ను నమ్మండి ఎందుకంటే నాది కుప్పం! ఇలా మాట్లాడే ఆయన ఎవరో తెలుసా?.. అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కన్నా. ‘వెన్నుపోటుకి వారసుడు, యూటర్న్‌కి దగ్గరి చుట్టం’ అంటూ హింట్ ఇస్తూ ఊసరవెల్లి ఫోటోను షేర్ చేశారు.