పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ: రేవంత్ రెడ్డి

వాస్తవం ప్రతినిధి: పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు ముందుకు రావాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో సీనియర్లు రంగంలోకి దిగితే కేడర్ కు మనోధైర్యం కలుగుతుందని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.