“ఆ ఎమ్మెల్యే”….మెజారిటీ పైనే అందరి దృష్టి…!!!

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ప్రతీ నియోజకవర్గాల నుంచి ఏ ఎమ్మెల్యే గెలుస్తారనే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ ఏపీలో ఆ ఒక్క నియోజకవర్గం గెలుపు విషయంలో కాకుండా కేవలం ఆ ఎమ్మెల్యేకి మెజారిటీ ఎంత వస్తుంది అనే లెక్కలపై చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఆ స్థానం నుంచీ సదరు ఎమ్మెల్యే గెలుపు పక్కా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎలాగైనా సరే ఈసారి సదరు ఎమ్మెల్యే ని ఓడించి తీరాలని టిడిపి అధినేత చంద్రబాబు పట్టుబట్టారని తెలుస్తోంది. ఇంతకీ మెజారిటీ పైనే అందరి పడేలా చేసిన ఆ ఎమ్మెల్యే ఎవరనే వివరాలలోకి వెళ్తే..

కృష్ణాజిల్లా గుడివాడ పేరు చెప్తే గుర్తొచ్చే మొట్టమొదటి వ్యక్తి పేరు కొడాలి నాని. ఈ స్థానం నుంచి కొడాలి గెలుపు ఖాయమనే విషయం టీడీపీ కి సైతం తెలిసిందే. అయితే కొడాలి ని ఢీ కొట్టడానికి కొన్నేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ రచిస్తున్న వ్యూహాలు ఏవీ కూడా కొడాలి కి ప్రజలలో ఉన్న క్రేజ్ ని తగ్గించలేక పోయాయి. ఎన్టీఆర్ ఫ్యామిలీ కి అన్యాయం జరిగిందంటూ కొడాలి నాని అడిగిన ప్రశ్న తో టీడీపీకి వ్యతిరేకిగా ముద్ర పడిన కొడాలి ఆ తరువాత పరిణామాలతో టీడీపీని వీడటం జరిగింది ఈ విషయం అందరికి తెలిసిందే. వైసీపీలో ఉన్నాసరే ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే అపారమైన అభిమానం కలిగి ఉన్న కొడాలికి గుడివాడ ప్రజలు బ్రహ్మరథం పడతారనేది జగమెరిగిన సత్యం.

ఇదిలాఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాష్ ని కొడాలికి పోటీగా గుడివాడ బరిలోకి దింపింది. అయితే కొడాలికి గెలుపు పక్కా అంటూ అనుకూలంగా నివేదికలు రావడంతో కేవలం కొడాలి గెలుపుపై మాత్రమే గుడివాడ ప్రజలు చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. గుడివాడలో గెలిచేది ఇది టీడీపీ నా , వైసీపీ నా అంటే రెండూ కాదు కొడాలి నాని అని అంటారు స్థానిక ప్రజలు. ఎందుకంటే కేవలం గుడివాడ ప్రజలు ఓటు వేసేది అక్కడ పార్టీలని చూసి కాదు కొడాలి ని చూసి అనేది అందరికి తెలిసన విషయమే. మరి ఈ ఎమ్మెల్యే కి ఎంతటి మెజారిటీ వస్తుందే త్వరలో తేలిపోనుంది అంటున్నారు పరిశీలకులు.