“చిత్తూరు”..లో చక్రం తిప్పుతున్న….“జగన్”

వాస్తవం ప్రతినిధి: ఏపీలో రాజకీయ నేతల వ్యూహ ప్రతివ్యూహాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ అధికారంలోకి రావడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఎలాగైనా సరే ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి తహతహలాడుతోంది. అందులో భాగంగానే అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి ఇరు పార్టీలు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో లో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు టిడిపి ఎంపీ సోదరికి పూతలపట్టు నుంచి టిక్కెట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని ఒప్పించి మరీ టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోదరి పద్మజ కు వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ చేశారు జగన్ . సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు తీవ్ర ప్రయత్నాలు చేసినా చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే సునీల్ కి ఎంతో సన్నిహితులు అయిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం సునీల్ కి ఏ విధమైన సాయం చేయలేని పరిస్థితి ఇ నెలకొంది .

మరోవైపు జిల్లాలోని మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు అయినప్పటికీ పూతలపట్టులో మాత్రం ఏ ఒక్క పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి లలితకుమారిని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సునీల్ స్వల్ప ఆధిక్యంతో ఓడించారు. 2009లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి పై లలితకుమారి స్వల్ప తేడాతో ఓడిపోయారు ఇలా రెండుసార్లు ఓటమి చెందిన లలిత కుమారి మూడో సారి తప్పకుండా విజయం సాధిస్తారని ఆశతో ఉన్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు సైతం లలితకుమారి కి టిక్కెట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు స్థానిక టిడిపి నేతలు .అయితే సునీల్ విషయంలో సర్వేలు చేయించిన జగన్ కి పెద్దగా ఆశించిన నా రిజల్ట్స్ రాకపోవడంతో సునీల్ ఎంపిక విషయంలో జగన్ ఆలోచించే పరస్థితి ఏర్పడింది. దాంతో ఎలాగైనా బాబు కి చెక్ పెట్టాలని అనుకుంటున్నా జగన్ కి ఈ విషయం బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.