భారత్ కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించిన ఆస్ట్రేలియా

వాస్తవం ప్రతినిధి: నిర్ణాయక ఐదో వన్డేలో ఆస్ట్రేలియా భారత్ కు 273 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఖవాజా సెంచరీతో, హ్యాండ్స్ కోంబ్ హాఫ్ సెంచరీతో రాణించారు. ఖవాజా, హ్యాండ్స్ కోంబ్ లు అవుటైన తరువాత ఆస్ట్రేలియా స్కోరింగ్ రేట్ మందగించింది. ఐదు వన్డేల సిరీస్ లో భారత్-2, ఆస్ట్రేలియా-2 విజయాలతో నిలిచిన సంగతి తెలిసిందే. చివరిదైన ఈ ఐదో వన్డే సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది.