మెగాస్టార్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!

వాస్తవం సినిమా: తెలుగు సినిమా రంగంలో స్వయంకృషితో తెలుగు సినిమా సింహాసనమెక్కిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశమంతటా బయోపిక్ లా పర్వం కొనసాగుతున్న క్రమంలో చిరంజీవి బయోపిక్ కూడా రాబోతున్నట్లు ఇండస్ట్రీ లోనే మరియు సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు గారు స్పందించారు. తన అన్న చిరంజీవి బయోపిక్ తీయడం సరైన ఆలోచన కాదు అని తేల్చి చెప్పేశారు. ‘‘చిరుపై బయోపిక్‌ తీయాల్సిన అవసరం లేదు. అన్నయ్య కెరీర్‌ ఆరంభంలో తను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా సక్సెస్‌ఫుల్‌ కెరీర్ సాగించాడు. ఇప్పటికి కూడా అందరం బాగానే ఉంటున్నాం కానీ అన్నయ్య బయోపిక్ తీసే ఆలోచనలో మేము ఎవ్వరమూ లేము… దయచేసి పుకార్లను నమ్మవద్దని నాగబాబు గారు తేల్చి చెప్పేశారు.