లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై టెన్షన్ పడుతున్న సినిమా యూనిట్ ..?

వాస్తవం సినిమా: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాజకీయ జీవిత చరిత్ర గురించి మరియు ఆయన భార్య లక్ష్మీపార్వతి ఆయన జీవితంలో అడుగుపెట్టిన తరువాత జరిగిన సంఘటనలు గురించి ప్రపంచానికి మరియు సన్నిహితులకు తెలియని కొన్ని విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు తెలియజేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రమంలో సినిమాల్లో ఎక్కువ శాతం టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రని చాలా నెగటివ్ గా చూపించిన క్రమంలో..మరోపక్క ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని టిడిపి నాయకులు ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. ముఖ్యంగా ఎలక్షన్లకు నెలరోజులు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని విడుదల చేస్తే కచ్చితంగా ఓటర్లు ప్రభావితం అవటం ఖాయమని సినిమా విడుద‌ల‌ను నిలిపివేయాల‌ని టీడీపీ కార్య‌క‌ర్త దేవిబాబు చౌద‌రి తాజాగా ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారం పై స్పందించిన ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. నిజాన్ని ఎవ‌రూ దాచ‌లేర‌ని, ఆ విష‌యం టీడీపీ నేత‌లు గుర్తుపెట్టుకోవాల‌ని ఆర్జీవీ సోష‌ల్ మీడియా ద్వార స్పందించారు. కానీ ఎలాంటి అవాంత‌రాలు వ‌చ్చినా తాను మాత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్ర‌క‌టించిన తేదీకే విడుద‌ల చేస్తాన‌ని, అస‌లైన నిజాలు చూపుతుంటే.. టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని రామ్ గోపాల్ వ‌ర్మ పేర్కొన్నారు.