మరొకసారి రొమాంటిక్ టైటిల్ తో నాగ శౌర్య- అవసరాల శ్రీనివాస్ సినిమా..?

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు నాగ శౌర్య. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన క్రమంలో ఊహల గుసగుసలు వంటి యూత్ ఫుల్ మరియు ఫ్యామిలీ సినిమా అందించిన డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తో మరొకసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారు శౌర్య. ముఖ్యంగా అవసరాల శ్రీనివాస్ తో చేసిన సినిమా నాగ శౌర్య కి మంచి బ్రేక్ ఇవ్వడంతో…ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు కొట్టేసిన నాగశౌర్య..ఆశించిన స్థాయిలో ఊహలు గుసగుసలాడే వంటి స్థాయిలో సరైన హిట్ కొట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత అవసరాల, నాగశౌర్య కలిసి సినిమా చేయనున్నారు, ఈ సినిమాకు “ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి” అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది,శ్రీనివాస్ అవసరాల మునుపటి సినిమాల్లాగే ఈ సినిమాకు కూడా గమ్మత్తైన టైటిల్ ను ఫిక్స్ చేసారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ చాలా వరకు విదేశాలలో జరుపుకోనున్నట్లు సమాచారం. నాగశౌర్య పక్కన హీరోయిన్ గా మాళవిక నాయక్ నటిస్తుందట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం.