అజ్ణాతంలోకి గంటా శ్రీనివాసరావు…??

వాస్తవం ప్రతినిధి: మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనారు. అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు పోటీ చేయాలని ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సూచించడంతో ఆయన అలకపూనారనీ, ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ణాతంలోనికి వెళ్లారని అంటున్నారు. అమరావతి వెళుతున్నట్లు చెప్పి నిన్న బయలుదేరిన ఆయన అమరావతి చేరుకోలేదనీ, ఎక్కడకు వెళ్లారో తెలియడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన సన్నిహితులు మాత్రం హైదరాబాద్ చేరుకున్నారని అంటున్నారు.