ఎట్టకేలకు టీడీపీ లోకే…..”జేడీ”

వాస్తవం ప్రతినిధి: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీలో లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు సమాధానంగా గా టిడిపిలో చేరుతారు అంటూ కథలు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విశాఖ జిల్లా భీమిలి నుంచి మాజీ జేడీ శాసనసభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తారని అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు తెలిసినవే అయితే

స్వచ్ఛందంగా అ తన పదవికి రాజీనామా చేసి ప్రజా సేవ చేయాలనే తలంపుతో ఇప్పటికే అటు రాయలసీమ కోస్తాంధ్రలో దాదాపు అన్ని జిల్లాలో రైతుల సమస్యలపై పర్యటించిన జెడి, రైతులతో నిరుద్యోగులతో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి ఓ వర్గం ప్రజలకు దగ్గర అయ్యారని చెప్పడంలో సందేహం లేదు. అప్పట్లో జేడీ పార్టీ పెడతారని , లోక్ సత్తా నుంచి పోటీ చేస్తారని కథనాలు వచ్చినా వాటి విషయంలో జేడీ స్పందించకపోవడంతో అవి గాలి వార్తలు గానే మిగిలిపోయాయి.

అయితే జేడీ టిడిపి తీర్థం పుచ్చుకుంటారా, లేదా అనే విషయంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాకపోవడం, సోషల్ మీడియాలో టీవీ చానల్స్ లో జెడి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు అంటూ వస్తున్న వార్తలు టిడిపి నేతల్లో కార్యకర్తల్లో లో జోష్ ను పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం లోపు ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని, మంత్రి గంటా లక్ష్మీనారాయణ తో మంతనాలు జరిపారని, అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే జె.డి చంద్రబాబు భేటీ జరగనుందని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తోంది.