ఎన్నికల తేదీలు – పంచాగాల గొడవ.. కొత్త చిక్కులతో తలలు పట్టుకొంటున్న అభ్యర్దులు .

వాస్తవం ప్రతినిధి: గత కొద్ది రోజులుగా ఎతో ఉత్కంటతో ఎదురు చూస్తున్న ఎన్నికల ప్రకటన రానే వచ్చింది. ఎన్నికలు జరిగే తేదికి ఫలితాలు ప్రకటించే తేదికి మధ్య ఎక్కువ రోజులు దూరం వుండవచ్చు అని అందరూ భావించారు. కాని ఆశ్చర్యకరంగా ఎన్నికల తేదికి ఎన్నికల సంఘం ఎక్కువ గడువు ఇవ్వలేదు. కానీ ఫలితాల విడుదలకు మాత్రం ఎన్నికలు జరిగిన తేది నుండి సుదీర్గమైన సమయం ఇచ్చింది.. పోటి చేసిన అభ్యర్దులు అన్నిరోజులు ఉత్ఖంఠతతో ఎదురు చూడాల్సి వస్తోంది..

ఇది ఇలావుండగా ఇప్పుడు పోటీ చేసే అభ్యర్ధులకు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన తేది మరియు సమయం హిందూ పంచాగ కాలమానం ప్రకారం తిధి చవితి మరియు రాహుకాలం. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఈ సమయంలో ఎవరు ఎటువంటి పనులు చేయుటకు ఉత్సాహం చూపించరు. ఇప్పుడు ఎన్నికల సంఘం చేసిన పనికి సెంటిమెంట్స్ ఎక్కువగా పాటించే మన రాజకీయ నేతల గుడెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అలాగే ఎన్నికలు జరిగే రోజు నాడు కూడా సష్టి తిధి మధ్యాన్నం 2 గం.ల 40 నిమిషాల వరకు వుందట. యమ గండం ఉదయం 6 గం నుండి 7.30 గం ల మధ్యలో వుందని, పోలింగ్ ఉదయం 7 గంల కే, ఈ సమయం లోనే ప్రారంభం అవుతుందని తెగ టెన్షన్ పడి పోతున్నారు. అదేవిధంగా రాహుకాలం ఆరోజు మధ్యాన్నం 2 నుండి 3.30 మధ్యలో ఉన్నందువల్ల ఈ సమయాలలో సెంటిమెంటు ఎక్కువ పాటించే వోటరు మహాశయులు పోలింగు కేంద్రాలకు తరలి వస్తారో రారో అని హడలిపోతున్నారు.

కొసమెరుపు ఎంటంటే ఎన్నికల ఫలితాలు ప్రకటించే తేది అనగా మే 23 మంచి దినమట. యిది సుదీర్ఘ కాలం పలితాలకోసం నిరీక్షించిన అభ్యర్ధులకు హాయిని కలిగించే అంశం. మరి ఎన్నికల సంఘం చేసిన ఈ పనికి జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్మే మన నేతల జాతకాలు ఎవరివి ఎలా తారుమారు ఆవుతాయో చూద్దాం.