ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. నేడు ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 11 వరకు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడతానన్నారు. ఏపీ ప్రభుత్వ డేటా చోరీపై వైసీపీ కేసు పెట్టడం తప్పుకాదన్నారు.

డేటాను దుర్వినియోగం చేయకపోతే చంద్రబాబు, ప్రభుత్వానికి కంగారు ఎందుకన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం ప్రభుత్వ సమాచారం బయటకు ఇవ్వడం నేరమన్నారు. ఏపీ డేటా చోరీ వ్యవహారం ఎన్నికలపై ప్రభావం చూపదన్నారు. ప్రభుత్వ పని తీరుపైనే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. జూన్‌లో పోలవరానికి నీళ్లు ఇవ్వడం అసాధ్యమన్నారు.