మహేష్ కి సారీ చెప్పిన అల్లు అర్జున్..!

వాస్తవం సినిమా: ఇటీవల సుకుమార్ తో సినిమా లేదని సోషల్ మీడియాలో మహేష్ బాబు పెట్టిన కామెంట్ చూసి చాలామంది షాక్ తిన్నారు. రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్న సుకుమార్కి ఒక్కసారిగా మహేష్ సుకుమార్ తో సినిమా లేదని మంచి కథ స్టోరీ తో మరొకసారి వస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన ట్వీట్ గురించి ఇండస్ట్రీలో చాలా మంది రకరకాలుగా అనుకున్నారు. ఇదే క్రమంలో మహేష్ రిజెక్ట్ చేసిన వెంటనే అదే సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు సుకుమార్ చెప్పడంతో…మహేష్- సుకుమార్ మధ్య ఏదో జరిగిందని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ అభిమానులు కూడా సుకుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ స్టార్ హీరోకి స్టోరీ నచ్చకపోతే…నచ్చేటట్లు కథ మార్పులు చేర్పులు చేసుకునే రావాలి కానీ అదే స్టోరీ తో వేరొకరితో చేయడం భావ్యం కాదని సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు ట్రోల్ చేయడంతో…వివాదం ముదురుతున్న క్రమంలో మహేష్ తనకి మధ్య ఉన్న బంధాన్ని చెడగొట్టకుండా హుందాగా …మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ లోకి వెళ్లి ప్రత్యేకంగా మహేష్ ని కలిసి…అల్లు అర్జున్ తో తీయబోయే సినిమా గురించి మాట్లాడుతూ..తనను క్షమించమని కోరాడట..తొందరపడి సినిమా అనౌన్స్ చేశా న్నాని ఒప్పుకున్నాడట సుకుమార్. దీంతో మహేష్ ఏం పర్లేదు మంచి కథ తీసుకుని రా ..ఇద్దరం కలిసి చేద్దామని సానుకూలంగా స్పందించడట.