‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

వాస్తవం సినిమా:  ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఈ మేరకు టిడిపి కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపేలా ఈ చిత్రం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆపాలని కోరారు. సినిమాలో సీఎం చంద్రబాబు పాత్రను నెగిటివ్‌గా చూపించారని, ఈ చిత్రం ఓటర్లపై ప్రభావం చూపుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 11 వరకు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు కాపీని స్వీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు .. పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపారు.