ప్రధాని మోడీ మనసు దోచిన గిర్ మృగరాజు

వాస్తవం ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన ఆకర్షణగా మారింది. గుజరాత్ లోని జునాఘడ్ వన్యమృగ అభయారణ్యంలో సంచరించే ఒక మృగరాజు ఒక తురాయి చెట్టు మీద (ఎర్రని అడవి వృక్షం) ఎక్కి ఠీవీ గా నిల్చుని అడవినంతా కలియజూస్తున్నట్లుగా ఉన్న ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం జరిగింది. దీనికి క్రింద క్యాప్షన్ గా “మెజస్టిక్ గిర్ లైన్ … లవ్లీ పిక్చర్” అని ఉంచడం జరిగింది. దీనికి నేటిజన్ల నుండి విపరీతమైన స్పందన వస్తోంది.
దీనిని మొదట జునాగడ్ వన్యమృగ అభయారణ్య సంరక్షణ అధికారి డా.సునీల్ కుమార్ జార్వాల్ తన క్రింద పనిచేయుచున్న బీటు గార్డు దీపక్ దగ్గర నుండి సంపాదించి ఈ చిత్రాన్ని పోస్టు చేసారు.
జునాఘడ్ వన్యమృగ అభయారణ్యంలో నివసిస్తున్న సింహాలు ప్రపంచంలోనే అరుదైన ఆసియా జాతికి చెందిన సింహాలు. ఇక్కడ దాదాపు 500 సింహాలు, 850 చదరపు మైళ్ళలో విస్తరించి వున్న ఈ అభయారణ్యంలో సంచరిస్తూ వుంటాయి